
నెల్లూరు పౌల్ట్రీ
అసోసియేషన్ ధరలు
బ్రాయిలర్ (లైవ్) : 130
లేయర్ (లైవ్) : 113
బ్రాయిలర్ చికెన్ : 226
బ్రాయిలర్ స్కిన్‌లెస్ : 250
లేయర్ చికెన్ : 192
ఆత్మకూరు
తహసీల్దార్ సరెండర్
నెల్లూరు (దర్గామిట్ట): ఆత్మకూరు తహసీల్దార్ లక్ష్మీనరసింహంను సీసీఎల్‌ఏకు సరెండర్ చేసినట్లు డీఆర్వో వెంకటనారాయణమ్మ తెలిపారు. గురువారం ఆమె తన కార్యాలయంలో మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన్ను సరెండర్ చేసినట్లు వెల్లడించారు.
గుంటూరులో
బుచ్చి యువతి ఆత్మహత్య
కోవూరు (బుచ్చిరెడ్డిపాళెం): బుచ్చిరెడ్డిపాళెం హౌస్‌తోటకు చెందిన ఓ యువతి (18) గురువారం గుంటూరులో ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. హౌస్‌తోటకు చెందిన ఒకరు గుంటూరులో నివాసం ఉంటున్నారు. వారి సిఫార్సు మేరకు హౌస్‌తోటకే చెందిన గిరిజన యువతి పరిమళ (18)ను గుంటూరులోని ఓ ఇంట్లో పనిలో పెట్టుకున్నారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆ యువతి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న బంధువులు మృతదేహాన్ని బుచ్చిరెడ్డిపాళెం తీసుకొచ్చారు. బాలిక తల్లిదండ్రులు షాద్‌నగర్‌లో ఇటుకబట్టీల్లో పని చేస్తున్నారు. సమాచారం అందుకున్న బుచ్చి ఎస్సై వీరప్రతాప్ వివరాలు సేకరిస్తున్నారు.
బంగారు ఆభరణాల చోరీ
నెల్లూరు(క్రైమ్): కిటికీ దగ్గర పెట్టిన బంగారు ఆభరణాలను గుర్తుతెలియని దుండగుడు అపహరించుకెళ్లాడు. ఈ ఘటన ఎన్టీఆర్ నగర్‌లో గురువారం పట్టపగలు జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఎన్టీఆర్ నగర్‌లో సీహెచ్ మాలకొండయ్య కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన గురువారం తన ఏడు సవర్ల బంగారు గొలుసు, ఉంగరాలను కిటికీ వద్ద పెట్టి స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌కు వెళ్లాడు. భార్య పనినిమిత్తం ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి బంగారు ఆభరణాలను అపహరించుకెళ్లాడు. స్నానం చేసి బయటకు వచ్చిచూడగా బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో బాధితుడు బాలాజీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సుమన్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.