
సంక్షేమ పథకాల లబ్ధిని వివరిస్తున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి
● కందుకూరు ఎమ్మెల్యే
మానుగుంట మహీధర్‌రెడ్డి
గుడ్లూరు: ‘రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా గడప గడపలో సంక్షేమ కాంతులు కనిపిస్తున్నాయి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన కొనసాగుతోంది.’ అని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పరకొండపాడు గ్రామ సచివాలయం పరిధిలో కొండారెడ్డిపాళెం, అగ్రహారం, పరకొండపాడు గ్రామాల్లో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రతి గడపకు వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి బుక్‌లెట్లు అందజేశారు. భూముల రీ సర్వేలో రెవెన్యూ అధికారులు తనకున్న 50 సెంట్లను తగ్గించి చూపించారని సుబ్బరాయుడు అనే రైతు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని రాగా వెంటనే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు సూచించారు. కరెంట్ స్తంభాలు మార్చాలని, గృహాలు మంజూరు చేయించాలని, గుడి నిర్మాణానికి సహకరించాలని పలువురు కోరగా ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పులి రమేష్, జెడ్పీటీసీ కోర్శిపాటి బాపిరెడ్డి, సర్పంచ్ కొండయ్య, తహసీల్దార్ సూర్యనారాయణ సింగ్, వైద్యాధికారి మారుతీరావు, ఎంఈఓ గోవర్ధన్, ఏఓ రవికుమార్, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యవర్గసభ్యుడు బిల్లా రమణయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ సూర్యనారాయణ, బ్రహ్మయ్య, ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొన్నారు.