Australian Batter Smashes 8 Sixes In An Over In Domestic Cricket League - Sakshi
Sakshi News home page

ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు.. ఆస్ట్రేలియా ఆటగాడు సరికొత్త రికార్డు

Oct 22 2021 10:40 AM | Updated on Oct 22 2021 3:04 PM

Australian batter smashes 8 sixes in an over in domestic cricket league - Sakshi

Australian Batter Smashes 8 sixes in an Over: ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ  ఒకే ఒవర్‌లో 8 సిక్సర్‌లు బాది  సామ్ హారిసన్ అనే ఆటగాడు సరికొత్త రికార్డు సృష్టించాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా క్లబ్ క్రికెట్‌లో భాగంగా సోర్రెంటో డంక్రైగ్ సీనియర్ క్లబ్, కింగ్‌స్లే వుడ్‌వాలే సీనియర్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. డంక్రైగ్ క్లబ్ ఇన్నింగ్స్‌ 39 ఓవర్‌ వేసిన నాథన్ బెన్నెట్ బౌలింగ్‌లో సామ్ హారిసన్ ఏకంగా 8 బంతుల్లో 8 సిక్సర్‌లతో విద్వంసం సృష్టించాడు. ఈ ఓవర్‌లో రెండు నో బాల్స్ కూడా ఉన్నాయి.

దీంతో ఆ ఓవర్‌లో ఏకంగా 50 పరుగులు అతడు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన సోరెంటో డంక్రైగ్  40 ఓవర్లలో 276 పరుగులు సాధించింది. అనంతరం 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్‌స్లే వుడ్‌వాలే నీర్ణీత 40 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. దీంతో డంక్రైగ్ క్లబ్ 122 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ మ్యాచ్‌కు సంబంధించిన స్కోర్‌ కార్డు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చదవండి: T20 WC 2021 IND Vs PAK: ఆ ఇద్దరు టీమిండియా క్రికెటర్ల నుంచే పాక్‌కు ముప్పు.. పాక్‌ బ్యాటింగ్‌ కోచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement