Abudhabi Night Riders ILT20: కేకేఆర్‌ ఫ్యామిలీలోకి ఇంగ్లండ్‌ విధ్వంసకర బ్యాటర్‌..

Abu Dhabi Knight Riders Announce Squad For Inaugural UAE ILT20 - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్‌ యూఈఏ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టి20లో అబుదాబి నైట్‌రైడర్స్‌ జట్టును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 14 మందితో కూడిన అబుదాబి నైట్‌రైడర్స్‌(ఏడీకేఆర్‌)జట్టును కేకేఆర్‌ యాజమాన్యం మంగళవారం తమ ట్విటర్లో ప్రకటించింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ఆడుతున్న ఆండ్రీ రసెల్‌, సునీల్‌ నరైన్‌లు యూఏఈ టి20లీగ్‌లోనూ అబుదాబి నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరితో పాటు ఇంగ్లండ్‌ స్టార్‌ జానీ బెయిర్‌ స్టో, ఐర్లాండ్‌ విధ్వంసకర ఆటగాడు పాల్‌ స్టిర్లింగ్‌, లంక క్రికెటర్లు చరిత్‌ అసలంక, లాహిరు కుమారాలు ఉన్నారు.. కొలిన్‌ ఇంగ్రామ్‌, అకిల్‌ హొసేన్‌లు కూడా ఎంపికయ్యారు. 

ఈ సందర్భంగా కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూర్‌ మాట్లాడుతూ.. ''క్రికెట్‌లో ప్రపంచవ్యాప్తంగా మా అడుగులు పడడం గొప్ప అచీవ్‌మెంట్‌ అన్ని చెప్పొచ్చు. ఐపీఎల్‌లో కేకేఆర్‌.. కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో టీకేఆర్‌.. తాజాగా ఐఎల్‌టి20లో ఏడీకేఆర్‌. కేకేఆర్‌ జట్టులో ఉన్న ఆండ్రీ రసెల్‌, సునీల్‌ నరైన్‌లు ఏడీకేఆర్‌లో ఉండడం మాకు సానుకూలాంశం. ఇక కేకేఆర్‌ ఫ్యామిలీలోకి బెయిర్‌ స్టోకు స్వాగతం. ఐఎల్‌టి20లో ఏడీకేఆర్‌ తరపున బెయిర్‌ స్టో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాలని కోరుకుంటున్నాం.


అలాగే లంక క్రికెటర్లు చరిత్‌ అసలంక, లాహిరు కుమారా.. ఐర్లాండ్‌ స్టార్‌ పాల్‌ స్టిర్లింగ్‌లకు కూడా గ్రాండ్‌ వెల్‌కమ్‌.  కొలిన్‌ ఇంగ్రామ్‌, అకిల్‌ హొసేన్‌, రవి రాంపాల్‌ సహా ఇతర క్రికెటర్లకు కూడా స్వాగతం. ఐఎల్‌టి20 ద్వారా మేం గ్లోబల్‌ క్రికెట్‌లో విజయవంతమయ్యే ప్రయత్నంలో ఉన్నాం. ఆల్‌ ది బెస్ట్‌ అబుదాబి నైట్‌రైడర్స్‌ టీం(ఏడీకేఆర్‌)'' అంటూ ముగించాడు. యూఏఈ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్‌ లీగ్‌ టి20(ఐఎల్‌టీ20) జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరకు జరగనుంది.

ఐఎల్‌టి 20 కోసం అబుదాబి నైట్ రైడర్స్ జట్టు: సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, జానీ బెయిర్‌స్టో, పాల్ స్టిర్లింగ్, లహిరు కుమార, చరిత్ అసలంక, కోలిన్ ఇంగ్రామ్, అకేల్ హోసేన్,రేమాన్ రీఫర్, ఎస్ ప్రసన్న, రవి రాంపాల్, కెన్నార్ లూయిస్,అలీ ఖాన్, బ్రాండన్ గ్లోవర్

చదవండి: MI Emirates: 'పొలార్డ్‌ నుంచి బౌల్ట్‌ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్‌పై కన్నేశారు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top