నామినేషన్ల ప్రక్రియ పరిశీలన
● నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ● రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు హరిత
తొగుట(దుబ్బాక): ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు హరిత హెచ్చరించారు. మండల కేంద్రంలో నిర్వహించిన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ డీఓ నాగేశ్వర్ పాల్గొన్నారు.
మిరుదొడ్డిలో..
మిరుదొడ్డి(దుబ్బాక): మిరుదొడ్డి మండల కేంద్రంతో పాటు, అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రాలను సోమవారం రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు హరిత సందర్శించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో రోజు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. నామినేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఆమె వెంట ఎంపీడీఓ గంగుల గణేశ్‌రెడ్డి, ఎంపీఓ ఫహీం, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఉన్నారు.


