ప్రజావాణి రద్దు
సిద్దిపేటరూరల్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఎన్నికల నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరగదని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు.
సర్పంచ్‌లకు 228..
వార్డులకు 287
రెండో విడత తొలి రోజు దాఖలైన నామినేషన్లు
సిద్దిపేటరూరల్: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా కొనసాగింది. ఆదివారం తొలిరోజు 10 మండలాల్లో 182 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు 228 దరఖాస్తులు రాగా, 1,644 వార్డు స్థానాలకు 287 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. రెండో విడత నామినేషన్ల ప్రక్రియకు 58 క్లస్టర్లను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది.
సమస్యాత్మక గ్రామాల్లో
నిఘా ముమ్మరం
గజ్వేల్ ఏసీపీ నర్సింహులు
గజ్వేల్: శాంతియుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరిగేలా అంతా సహకరించాలని గజ్వేల్ ఏసీపీ నర్సింహులు పిలుపునిచ్చారు. ఆదివారం గజ్వేల్ మండలం జాలిగామ, బెజుగామ గ్రామాల్లో పోలీసు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా...పోలీసు శాఖకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. కాగా ఆయా గ్రామాల్లోని కూడళ్లల్లో పోలీసులతోపాటు ప్రత్యేక బలగాలు కవాతు నిర్వహించాయి. కార్యక్రమంలో గజ్వేల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, అదనపు ఇన్‌స్పెక్టర్ ముత్యంరాజు, ఎస్‌ఐలు ప్రేమ్‌దీప్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆలయ పునర్నిర్మాణానికి విరాళం
నిబంధనలు
అతిక్రమిస్తే చర్యలు
మిరుదొడ్డి(దుబ్బాక): ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి హెచ్చరించారు. 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ల స్వీకరణ నేపధ్యంలో ఆదివారం మండల పరిధిలోని అల్వాల, చెప్యాలతో పాటు అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని రుద్రారం, అల్మాజీపూర్, జంగపల్లి, వీరారెడ్డిపల్లి గ్రామాల్లో పోలీసు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ర్యాలీలు, ధర్నాలు, ఆందోళన వంటి కార్యక్రమాలు నిర్వహిచరాదన్నారు. ఇంటి యజమానుల అనుమతులు లేకుండా గొడలపై ఎన్నికల ప్రచారం చేయవద్దన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని కోరారు.
రేబిస్ వ్యాధితో అప్రమత్తం
మద్దూరు(హుస్నాబాద్): రేబిస్ వ్యాధితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లద్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అఽధికారి డాక్టర్ అర్జున్ సూచించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కుక్కలు, కోతులు, ఎలుగుబంటితో పాటు ఇతర జంతువులు కాటు వేసినపుడు రేబిస్ వ్యాధి సోకుతుందన్నారు. ఈ వ్యాధి సోకినపుడు వైరల్ ఫీవర్‌తో పాటుగా వివిధ లక్షణాలు ఉంటాయని, వెంటనే ఆరోగ్య కేంద్రానికి వచ్చి చికిత్స చేయించుకోవాలని సూచించారు.
ప్రజావాణి రద్దు


