నేటి నుంచి నూతన మద్యం పాలసీ
సిద్దిపేటకమాన్: జిల్లాలో 2025–27 సంవత్సరానికి డిసెంబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలవుతుందని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి తెలిపారు. జిల్లాలో 93 మద్యం దుకాణాల ద్వారా విక్రయాలు జరగనున్నట్లు తెలిపారు. సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల, మిరుదొడ్డి సర్కిల్ పరిధిలోని 93 మద్యం దుకాణాల నూతన పాలసీ ప్రకారం నిర్వహణకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా మొత్తం 2,782 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్ 27న కలెక్టర్ హైమావతి ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వారా మద్యం షాప్‌లను కేటాయించారు. షాప్‌లను దక్కించుకున్న లైసెన్స్‌దారులు సోమవారం నూతన మద్యం దుకాణాలను నడపనున్నారు.


