నటనపై ఆసక్తితోనే సినిమాల వైపు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ కుర్రాడు.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రలు పోషించి తనదైన శైలితో గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకులకు మరింత దగ్గరగా అవుతున్నారు నటుడు తిరువీర్. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా నటించారు. ప్రస్తుతం భరత్ భూషణ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా సిద్దిపేట పట్టణ శివారులోని చంద్లాపూర్‌లో షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమాలో హీరోగా తిరువీర్ నటిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో తిరువీర్‌ను ‘సాక్షి’ పలకరించింది. వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే..
షూటింగ్‌లు చూసి..
సిటీ కాలేజ్‌లో డిగ్రీ చదువుతున్న సమయంలో కాలేజీ ప్రాంగణంలో సినిమా షూటింగ్‌లు జరిగేవి. అప్పటి నుంచి సినిమాల్లో నటించాలని కోరిక కలిగింది. అదే లక్ష్యంతో డిగ్రీ పూర్తి అయిన తర్వాత తెలుగు యూనివర్సీటీలో ఆర్ట్స్ పై కోర్సు చేశాను. రంగస్థల నటునిగా పలు నాటికలు వేశాను. నా నటనను చూసి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. నేను నటించిన సినిమా తెర మీద కన్పించడం చాలా సంతోషంగా ఉంది. యాక్టర్ అవుతే చాలు అనుకున్నా.. ప్రజలు అభిమానంతో హీరోను అయ్యాను. రెడియో జాకీగా సైతం పని చేశాను. నాకు ఇష్టమైన నటుడు జూనియర్ ఎన్టీఆర్.
బొమ్మల రామారం సినిమాతో
2016లో బొమ్మల రామారం సినిమాతో సినీ ఫీల్డ్‌లోకి ఎంటరయ్యాను. నా మొదటి సినిమా నుంచే గుర్తింపు వచ్చింది. 2019లో వచ్చిన జార్జ్‌రెడ్డి(లలన్ సింగ్ పాత్ర), 2020లో వచ్చిన పలాస 1978 (రంగారావు పాత్ర)లలో నటించాను.
‘మసూద’ తో హీరోగా టర్నింగ్ పాయింట్
2022లో వచ్చిన హర్రర్ థ్రిల్లర్ ‘మసూద’ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. ఈ సినిమాను ప్రజలు బాగా ఆదరించారు. ఆ సినిమా హిట్ రావడంతో మంచి గుర్తింపు వచ్చింది. 2023లో వచ్చిన ‘పరేషాన్’ సినిమా ద్వారా ప్రేక్షకుల నుంచి మార్కులు కోట్టేశాను. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ ఎంతో బూస్టింగ్ ఇచ్చింది. సిద్దిపేట టౌన్ లోపలికి రావడం ఇదే మొదటి సారి. రంగనాయకసాగర్‌ను షూటింగ్ జరుగుతుండగా బ్రేక్ టైం వెళ్లి చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా కోమటి చెరువు, మల్లన్నసాగర్‌లు చూడాలి.
‘బొమ్మల రామారం’తో
సినిమా రంగంలోకి
‘మసూద’లో హీరోగా టర్నింగ్ పాయింట్
‘సాక్షి’తో నటుడు తిరువీర్
చంద్లాపూర్‌లో సినిమా షూటింగ్


