ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
సిద్దిపేటజోన్: తెలంగాణ మలి విడత ఉద్యమాన్ని మలుపు తిప్పింది కేసీఆర్ దీక్ష అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శనివారం దీక్షా దివస్ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక కీలకమైన ఘట్టాలు, కేసీఆర్ దీక్ష, అమరవీరుల త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నారు. తెలంగాణ ఉద్యమంతో సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉందన్నారు. సిద్దిపేట పట్టణంలో దీక్ష శిబిరాన్ని శ్రీకృష్ణ కమిటీ సందర్శించి అభిప్రాయాలు సేకరించినట్టు గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోటి ఎకరాల మాగాణి అయిందన్నారు. అంతకుముందు దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొందరు మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన అందెశ్రీకి సమావేశంలో సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి హరీశ్‌రావు పూలమాల వేసి బైక్ ర్యాలీని ప్రారంభించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని నివాళలర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సిద్దిపేట దీక్షలకు గుర్తుగా పైలాన్ ఆవిష్కరించి అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, నాయకులు శర్మ, రాజనర్స్, రవీందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, సాయిరాం, చిన్న, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ కవర్లు వద్దు బాబూ..!
సిద్దిపేటజోన్: ‘‘ఏమి తమ్మీ.. కర్రీ పాయింట్ మంచిగా నడుస్తోందా? ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నవా? వద్దు బాబు.. ప్లాస్టిక్ కవర్లలో వేడి కర్రీ వల్ల భవిష్యత్‌లో క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి. స్టీల్ బాక్స్ తెచ్చుకొమ్మని చెప్పు..’’ అంటూ ఎమ్మెల్యే హరీశ్‌రావు కర్రి పాయింట్ నిర్వహకుడికి సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలో ఒక ఆప్టికల్స్ షాప్‌ను ప్రారంభించారు. పక్కనే ఉన్న కర్రీ పాయింట్ వద్ద జనం రద్దీగా ఉండడంతో అక్కడి వెళ్లి ముచ్చటించారు. సిద్దిపేటలో ప్లాస్టిక్ కవర్ల వాడకం నిషేధించారని, ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు. ఆయన వెంట ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్ శ్రీ 2025


