3న సీఎం రాక
సభా ఏర్పాట్లను పరిశీలించిన పొన్నం
హుస్నాబాద్: డిసెంబర్ 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లను శనివారం రాత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, భవిష్యత్‌లో చేయాల్సిన కార్యక్రమాలపై సీఎం మాట్లాడుతారని చెప్పారు. సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, నాయకులు చిత్తారి రవీందర్. ఎండీ హస్సేన్. సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


