మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దు
గజ్వేల్‌రూరల్: పట్టణంలోని ఐఓసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) చౌరస్తా వద్ద వైన్ షాపు ఏర్పాటు చేయవద్దంటూ పట్టణానికి చెందిన పలువురు హైదరాబాద్‌లోని హెచ్‌ఆర్‌సీ(మానవ హక్కుల కమిషన్)కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని సంగాపూర్ మార్గంలో రోడ్డు పక్కన మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు పడతామన్నారు. ఈ మా ర్గంలో దేవాలయం, ఐఓసీ, రెండు ఎడ్యుకేషన్ హబ్‌లు ఉన్నాయని, ఎడ్యుకేషన్ హబ్‌లోగల వసతి గృహాల్లో సుమారు రెండు వేల మంది వరకు విద్యార్థినులుంటారని వాపోయారు. ప్రతి రోజు సుమారు మూడు వేల మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ హబ్‌లలో రాకపోకలు సాగిస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కలెక్టర్, పోలీసు కమిషనర్, ఆర్డీఓ, ఎకై ్సజ్, మున్సిపల్‌శాఖల అధికారులకు వినతిపత్రాలు అందించినట్లు చెప్పారు.
హెచ్‌ఆర్సీకి స్థానికుల ఫిర్యాదు


