ఆటో డ్రైవర్లు యూనిఫాం ధరించాల్సిందే
సిద్దిపేటకమాన్: ఆటో డ్రైవర్లు తప్పకుండా యూనిఫాం ధరించాలని ట్రాఫిక్ ఏసీపీ సుమన్‌కుమార్, సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలపై సీఐ గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు యూనిఫాం ధరించడం వల్ల ప్రయాణికుల్లో భద్రతా భావం పెరుగుతుందన్నారు. పార్కింగ్ ప్రదేశాల్లోనే ఆటోలు నిలుపుకోవాలని, ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకూడదని సూచించారు. ఆటోల్లో పెద్ద పెద్ద సౌండ్ బాక్స్‌లు పెట్టి ప్రయాణికులు, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించకూడదన్నారు. పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులను తరలించవద్దని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఆర్సీ పత్రాలు, ఇతర అన్ని రకాల డాక్యుమెంట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నా రు. క్రమశిక్షణతో ఉండే డ్రైవర్లను గుర్తించి ఏడాదికి ఒకసారి సన్మానిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐ విజయ్‌భాస్కర్, ఉమేష్, సిబ్బంది మహేష్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


