పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలి
జిల్లా అధ్యక్షుడు కస్తూరి సతీష్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని, జిల్లా అధ్యక్షుడు కస్తూరి సతీష్ అన్నారు. చేర్యాల పద్మశాలి సంఘంలో విజయం సాధించిన కార్యవర్గానికి గురువారం సిద్దిపేటలోని జిల్లా కార్యవర్గం ఘనంగా సన్మానించింది. అనంత రం జిల్లా కార్యవర్గాన్ని చేర్యాల కార్యవర్గ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడు తూ పద్మశాలీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుండాలన్నారు. సర్పంచ్ ఎన్నికలలో పద్మశాలీలను అత్యధికంగా పోటీ చేయించి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బూర మల్లేశం, ముదిగొండ శ్రీనివాస్, పేర్ల కృష్ణ దయాసాగర్, తాళ్ల విఠల్, సిరిసిల్ల బాలకిషన్, వంగర శ్రీశైలం, చేర్యాల అధ్యక్షులు కొక్కుల సురేందర్, ప్రధాన కార్యదర్శి బాలనర్సు, కోశాధికారి మల్లిపెద్ది వెంకటేశం, గోనె శ్రీహరి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


