
సిద్దిపేటకు చేరుకున్న రైలు ఇంజిన్
సిద్దిపేటఅర్బన్: సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల నెలవేరింది. సిద్దిపేటకు రైలు సౌకర్యం కావాలని 60 ఏళ్లుగా ఎదురుచూసిన క్షణం బుధవారం ఆవిష్కృతమైంది. రైలు పట్టాలపై 120 కి.మీ. స్పీడుతో రైలు పరుగులు పెట్టడం చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. మనోహారాబద్–కొత్తపల్లి రైలు మార్గంలో భాగంగా గజ్వేల్ నుంచి సిద్దిపేట మధ్య బుధవారం రైల్వే అధికారులు ఇంజన్, రెండు బోగీలతో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ప్రక్రియ గురువారం సైతం కొనసాగనున్నది. శుక్రవారం రైల్వే సేఫ్టీ అధికారుల సమక్షంలో పూర్తి బోగీలతో రైలు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ సందర్భంగా రైలు వద్ద సంబరాలు చేసుకున్నారు.
నెరవేరిన 60 ఏళ్ల కల
గజ్వేల్ నుంచి సిద్దిపేట వరకు ట్రయల్‌రన్