
స్థానిక ఎన్నికల్లో సత్తాచాటుదాం
గజ్వేల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానిక ఎన్నికల ఇన్‌చార్జి నవాబ్ ముజాహిద్ పిలుపునిచ్చారు. బుధవారం గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థాయి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నవాబ్ ముజాహిద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందని సూచించారు. టీసీసీ ప్రధాన కార్యదర్శి దయాకర్ మాట్లాడుతూ విభేదాలకు తావు లేకుండా పార్టీ గెలుపునకు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పథకాలకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తున్నదని, ఇదే గెలుపునకు సోపానమన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మడుపు భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, మార్కెట్ కమీటీల చైర్మన్లు వంటేరు నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, విజయమెహన్, గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాల్గొన్నారు.
టీపీసీసీ ఉపాధ్యక్షుడు నవాబ్ ముజాహిద్
గజ్వేల్‌లో పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశం