
పనులు సాగక.. భగీరథ అందక
మంచినీటికి తప్పని కష్టాలు
● మల్లన్నసాగర్ పైప్‌లైన్ల పనులు పూర్తయితేనే సరఫరా
● 16కిలోమీటర్ల మేర పనులకు 400 మీటర్లు పెండింగ్
● బిల్లుల చెల్లింపుల్లో జాప్యమే కారణం
● సమస్య పరిష్కారానికి అధికారయంత్రాంగం దృష్టి
జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ నీటి కష్టాలు అంతా ఇంతా కాదు. సగానికిపైగా నీటి సరఫరా తగ్గడంతో జనం అల్లాడుతున్నారు. ప్రత్యేకించి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సమస్య తీవ్ర రూపం దాల్చింది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, ఇతర సమస్యల కారణంగా ఈ రెండు నియోజకవర్గాలకు మల్లన్నసాగర్ నుంచి ప్రత్యేకంగా వేస్తున్న పైప్‌లైన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. – గజ్వేల్