
‘సాంస్కృతిక’ సలహాదారుగా దరువు అంజన్న
దుబ్బాకటౌన్: రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహాదారు కమిటీ సభ్యుడిగా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, ఓయూ జేఏసీ చైర్మన్ దరువు అంజన్న నియామకమాయ్యరు. 20 మంది సభ్యులతో ఉన్న కమిటీలో అంజన్న ఉండడం విశేషం.
కౌన్సెలింగ్‌కు
470 మంది హాజరు
నంగునూరు(సిద్దిపేట): రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌కు బుధవారం 470 మంది విద్యార్థు లు హాజరయ్యారు. ఈసందర్భంగా అధ్యాపకులు ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలించి ఐడీ, పాస్‌వర్డు అందజేశారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ గోవర్ధన్ మాట్లాడుతూ కౌన్సెలింగ్‌కు హజరవుతున్న విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు అభినవ్, షెహబాజ్, రాజు, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
రోశయ్య విగ్రహ ఏర్పాటు
అభినందనీయం
జిల్లా ఆర్యవైశ్య మహసభ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): హైదరాబాద్‌లో ఈ నెల 4న ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహావిష్కరణను ఆహ్వానిస్తున్నామని జిల్లా ఆర్యవైశ్య మహాసభ నాయకులు తెలిపారు. మరోవైపు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని మహాసభ నాయకులు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులు మాట్లాడారు. రోశయ్య పదహారు సార్లు ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశ పెట్టి దేశంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. రోశయ్య జయంతిని ఆధికారికంగా నిర్వహించడం, విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులు గంప శ్రీనివాస్, తణుకు ఆంజనేయులు, కాసం నవీన్ కుమార్, యాసాల వెంకట్ లింగం, మంచాల శ్రీనివాస్, మంకాల నాగారాణి, హేమలత, సముద్రాల హరినాథ్, డాక్టర్ మంకాల నవీన్ కుమార్, గంప కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ హామీ ఏమాయె..
చేర్యాల(సిద్దిపేట): పార్లమెంట్ ఎన్నికల సమయంలో చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయిస్తానన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇప్పటికీ నెరవేరలేదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొంగరి వెంకట్‌మావో అన్నారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చామల ఎంపీగా బాధ్యతలు చేపట్టి 15నెలలు గడిచినా రెవెన్యూ డివిజన్ అంశం మర్చిపోయారన్నారు. సంక్షేమ, అభివృద్ధి పనుల పేరుతో చేర్యాల ప్రాంతానికి వచ్చి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ప్రజలు, ప్రజా స్వామ్యవాదులు, మేధావులు ఖండిచాలన్నారు. ఇచ్చిన మాట మరిచిన ఎంపీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి బండకింది అరుణ్‌కుమార్, కొమురవెల్లి మండల కార్యదర్శి తాడూరి రవీందర్, పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు, నాయకులు పోలోజు శ్రీహరి, బోయిన మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
వాహన విడిభాగాల వేలం
సిద్దిపేటకమాన్: కమిషనరేట్ పరిధిలోని పోలీసు వాహనాలకు వినియోగించిన టైర్లు, బ్యాటరీలు, విడిభాగాలను వేలం వేయనున్నట్లు సీపీ అనురాధ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 8న సీఏఆర్ హెడ్ క్వార్టర్‌లో ఉదయం 9.30 గంటలకు వేలం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలంలో పాల్గొ నే వారు 9గంటల వరకు చేరుకోవాలన్నారు. వేలంపాట పూర్తి కాగానే డబ్బు చెల్లించి వస్తువులు తీసుకెళ్లవచ్చన్నారు. మరిన్ని వివరాలకు ఏఆర్ ఎస్‌ఐ వెంకటేశం, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ధరణికుమార్, ఏఆర్ కానిస్టేబుల్ విజయ్‌ను సంప్రదించాలని సూచించారు.

‘సాంస్కృతిక’ సలహాదారుగా దరువు అంజన్న

‘సాంస్కృతిక’ సలహాదారుగా దరువు అంజన్న