‘ట్రస్మా’ ప్రమాణ స్వీకారం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): తెలంగాణలో అనుమతి పొందిన ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ (ట్రస్మా) జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం బుధవారం జిల్లా కేంద్రంలో జరిగింది. ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శిగా గోపు ఇన్నారెడ్డి, కోశాధికారిగా తవుట రామాంజనేయులు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కదిరే రవి, జిల్లా స్పోక్‌పర్సన్‌గా రేపాక భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా తెలంగాణ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, స్టేట్ ట్రెజరర్ రాఘవేందర్ రెడ్డి, ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ కొమురయ్య పాల్గొన్నారు.


