ఐక్యత మార్చ్‌లో సిద్దిపేట వాసి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో నిర్వహించిన ఐక్యత మార్చ్‌లో జిల్లాకు చెందిన బీజేవైఎం రాష్ట్ర నాయకుడు తాటికొండ శ్రీనివాస్ పాల్గొన్నాడు. ఆదివారం వడోదరలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలో నిర్వహించిన యూనిటీ మార్చ్‌లో ఆయన పాల్గొన్నట్లు తెలిపారు.
దుబ్బాకటౌన్: రాయపోల్ మండల పరిధిలోని బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడు కొలుకూరి భాస్కర్ రెడ్డి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌కు రెండోసారి ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం ప్రమీల ఆదివారం తెలిపారు. 2025 డిసెంబర్ 6 నుంచి 9 వరకు హర్యానాలోని పంచకుల క్యాంపస్‌లో జరగనున్న ఎడ్యుకేషన్ ఫర్ అస్పైరింగ్ ఇండియా సైన్స్ సఫారీ, గేమ్స్, అడ్వెంచర్స్ వర్క్‌షాప్‌లో ప్రతినిధిగా పాల్గొననున్నా రు. సైన్స్ బోధనలో వినూత్న పద్ధతులు, ఆవిష్కరణలను ఆయన ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల హెచ్‌ఎం ప్రమీల, ఉపాధ్యాయ బృందం ఆయనను అభినందించారు.
ఒకరికి తీవ్ర గాయాలు
రామాయంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా... నార్సింగి మండలం నర్సంపల్లికి చెందిన రియాజ్ (32), నార్సింగికి చెందిన స్నేహితుడు ఇస్మాయిల్‌తో కలిసి బైక్‌పై రామాయంపేటకు వచ్చారు. తిరిగి వెళ్తున్న క్రమంలో అతి వేగంతో బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోగా, రియాజ్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ ఇస్మాయిల్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లారీని ఢీకొట్టిన ఘటనలో..
మనోహరాబాద్(తూప్రాన్): ముందు వెళ్తున్న లారీని బైక్‌తో ఢీకొట్టి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని కాళ్లకల్ శివారులో జాతీయ రహదారి–44పై ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి బైక్‌పై వచ్చిన వ్యక్తి అదుపుతప్పి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సిద్దిపేటకమాన్: బాధితులను ఆదుకోవాలని గొర్రెల కాపరులు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరి యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట మున్సిపాలిటీ లింగారెడ్డిపల్లిలో విద్యుత్ షాక్‌తో 15 మేకలు చనిపోయాయి. కాగా ఆ యజమానులను ఆయన పరామర్శించారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో విద్యుత్ వైర్లు తెగి మంద చుట్టూ ఉన్న పెన్సింగ్ మేకలపై పడటంతో విద్యుత్ షాక్‌తో చనిపోయాయని తెలిపారు. బాధితులు దర్గయ్య, నర్సింలును ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మేకకు రూ.15వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షుడు రాజమల్లయ్య,యాదవ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు రాము, శ్రీకాంత్, ప్రశాంత్ పాల్గొన్నారు.
ఐక్యత మార్చ్‌లో సిద్దిపేట వాసి
ఐక్యత మార్చ్‌లో సిద్దిపేట వాసి


