రామాయంపేట(మెదక్): పాపన్నపేట మండల కేంద్రంలో ఆదివారం జరిగిన జూనియర్ కబడ్డీ పోటీల్లో మండలంలోని ప్రగతి ధర్మారం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రాఘవి, పవిత్రను గ్రామస్తులతోపాటు ఉపాధ్యాయులు ప్రశంసించారు. డిసెంబర్ 2 నుంచి నాలుగు వరకు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.
భుజిరంపేట విద్యార్థులు..
కౌడిపల్లి(నర్సాపూర్): కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి పోటీలకు మండలంలోని భుజిరంపేట ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు ఎస్. దీక్ష, కే.పూజిత ఎంపికై నట్లు హెచ్‌ఎం సునీత, పీడీ శేఖర్ తెలిపారు. ఆదివారం పాపన్నపేట ఉన్నత పాఠశాలలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. డిసెంబర్ 2నుంచి 4వ తేదీ వరకు నాగార్జునసాగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.


