రాష్ట్రస్థాయి రగ్బీలో తృతీయస్థానం
మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర స్థాయి బాల,బాలికల రగ్బీలో ఉమ్మడి మెదక్ జిల్లా తృతీయస్థానం సాధించినట్లు పాఠశాల క్రీడా సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 28, 29, 30వ తేదీల్లో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో రాష్ట్రస్థాయి అండర్–17 బాల బాలికల రగ్బీ టోర్నమెంట్ నిర్వహించారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా ఇరు జట్లు తృతీయ స్థానం సాధించినట్లు తెలిపారు. బాలుర విభాగంలో కరీంనగర్, మెదక్ జిల్లా మధ్య సాగిన మ్యాచ్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు 29–7 పాయింట్స్ తేడాతో విజయం సాధించి తృతీయ స్థానం దక్కించుకుంది. బాలికల విభాగంలో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు 7–0 పాయింట్స్ తేడాతో నల్లగొండ జట్టుపై విజయం సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి విజయ క్రీడాకారులను, మెదక్ జిల్లా జట్టు మేనేజర్ శారద, శిక్షకులు నవీన్, మహేశ్‌ను అభినందించారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ కలెక్టర్ ప్రోత్సాహంతో బాలికలు వివిధ క్రీడల్లో జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు.


