
తాళం వేసిన ఇంట్లో చోరీ
నగదు, నగలు అపహరణ
తూప్రాన్: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం... పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా నివాసం ఉంటున్న కిచెన్‌గారి కృష్ణ కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని రూ.లక్ష నగదు, అర తులం బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్లూస్‌టీంతో వేలిముద్రలు సేకరించారు. కాగా బాధితులు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.