
6న ఫుట్‌బాల్ జట్టు ఎంపిక
సిద్దిపేటజోన్: సిద్దిపేట ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 6న జిల్లా జూనియర్ బాలికల ఫుట్‌బాల్ జట్టు సభ్యుల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు గణేష్, ప్రధాన కార్యదర్శి అక్బర్ తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్థానిక ఫుట్‌బాల్ మైదానంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు బాలికల జూనియర్ జట్టు కోసం ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. ఆధార్ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రం, రెండు పాస్ ఫొటోలతో ఈనెల 6న ఉదయం హాజరుకావాలని సూచించారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 9న ఆదిలాబాద్‌లో జరగనున్న జూనియర్ బాలికల చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని తెలిపారు. వివరాలకు 9885 789008, 9989 484657 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సాజిద్, తదితరులు పాల్గొన్నారు.