
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
ఎమ్మెల్యే సునీతారెడ్డి
హత్నూర (సంగారెడ్డి): అకాల వర్షంతో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. హత్నూర మండలం దౌలాపూర్ దౌల్తాబాద్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే సునీతారెడ్డి సందర్శించి తడిచిన ధాన్యాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ధాన్యం తెచ్చి రోజులు గడిచినా కేంద్రాల వద్ద కొనుగోళ్లు చేయకపోవడంతోనే వర్షాలకు ధాన్యం తడిచిపోయిందన్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని లేకుండా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.