
పట్లోళ్ల కుంట ఆక్రమణపై పరిశీలన
వట్‌పల్లి(అందోల్): మండల పరిధిలోని ఉసిరికపల్లి గ్రామంలో పట్లోళ్లకుంట శిఖం భూమి ఆక్రమణపై ఈ నెల 8న ‘సాక్షి’దినపత్రికలో ‘కబ్జా కోర ల్లో పట్లోళ్ల కుంట’అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించారు. సోమవారం డిప్యూటీ తహసీల్దారు చంద్రశేఖర్, ఇరిగేషన్ ఏఈ నిషిత గ్రామానికి వెళ్లి కుంటను పరిశీలించారు. కుంట పరిధిలో పంట వేసిన వారిని పిలిచి వివరాలు అడిగారు. రెండు రోజుల్లో సర్వే చేసి కుంట శిఖం భూమి ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నదనే విషయాన్ని గుర్తిస్తామని అధికారులు తెలిపారు.

పట్లోళ్ల కుంట ఆక్రమణపై పరిశీలన