
అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు: బల్దియా పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రదర్శించవద్దని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని..నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తిచేసే ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని ఆయన అధికారులను ఆదేశించారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని రామచంద్రపురం, భారతినగర్, పటాన్‌చెరు డివిజన్‌ల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు డివిజన్‌ల పరిధిలో శంకుస్థాపన చేసిన పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.