
రోడ్ల విస్తరణతోనే అభివృద్ధి సాధ్యం
ఎంపీ రఘునందన్‌రావు
సంగారెడ్డి టౌన్/సంగారెడ్డి జోన్: కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహులకు మద్దతు ఇస్తోందని ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలులో జిన్నారం మత ఘర్షణలో అరెస్ట్ అయిన బీజేపీ కార్యకర్తను సోమవారం ఎంపీ పరామర్శించారు. అనంతరం కలెక్టరేట్‌లో జాతీయ రహదారి 65 విస్తరణపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిన్నారం ఘటనలో అరెస్ట్ అయిన వారి పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తోందని దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారుల విస్తరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. రహదారుల విస్తరణతో అభివద్ధికి బాటలు పడతాయన్నారు.