
భారీ వాహనం బోల్తా
కంది(సంగారెడ్డి): కంది మండలం మామిడిపల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై భారీ వాహనం బోల్తా పడింది. శనివారం రాత్రి నాందేడ్ అకోలా వైపు నుంచి ముంబై వైపు వెళ్తున్న భారీ వాహనం మామిడిపల్లి చౌరస్తా వద్ద బ్రిడ్జి దిగుతున్న క్రమంలో మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బోల్తా పడిన సమయంలో వెనక నుంచి ఇతర వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ విషయమై రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందలేదని ఎస్సై రవీందర్ తెలిపారు.