
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
ఎంపీ సురేశ్ కుమార్ షెట్కర్
పటాన్‌చెరు టౌన్: అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కర్ పేర్కొన్నారు. ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డికి ఇటీవలే శ్రమశక్తి అవార్డు వచ్చిన నేపథ్యంలో ఆదివారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని టీజీఐఐసీ భవన్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ సురేశ్ కుమార్ షెట్కర్, టీఐసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి హాజరై మాట్లాడారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్న నరసింహారెడ్డి సేవల్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు అందజేయం ఆనందగా ఉందన్నారు. అనంతరం ముఖ్య అతిథులను నరసింహారెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, హెచ్‌ఎంఎస్ జాతీయ కార్యదర్శి సుదర్శన్ రావ్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయిలు, ప్రసాద్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.