
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
వట్‌పల్లి(అందోల్): మండల పరిధిలోని కేరూర్, బిజిలీపూర్, ఖాదిరాబాద్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు కానీ ధాన్యం కొనుగోళ్లు మాత్రం చేయలేదు. దీంతో ఈ నెల 11న ‘సాక్షి’దినపత్రికలో ‘24 రోజులైనా గింజ కొనలే’అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం తూకం వేయకపోవడానికి కారణాలను తెలుసుకుని వెంటనే కొనుగోళ్లు జరిపించాలని మండల ఐకేపీ ఏపీఎం చంద్రశేఖర్‌ను ఆదేశించారు. దీంతో ఆయన అక్కడికి చేరుకుని రైతులతో కలిసి స్థానికంగా ఉన్న కూలీలతో మాట్లాడి కొనుగోళ్లు జరిపించారు. ఎట్టకేలకు ఇరవై రోజులకుపైగా ధాన్యం కొనుగోళ్ల కోసం ఎదురుచూసిన రైతులు కొనుగోళ్లు జరపడం పట్ల ‘సాక్షి’కి ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం