మెథడిస్ట్ జాతరలో ఎమ్మెల్యే మాణిక్‌రావు
జహీరాబాద్: ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే మాణిక్ రావు ఆకాంక్షించారు. జహీరాబాద్ పట్టణంలోని గార్డెన్‌నగర్‌లో శనివారం నుంచి ప్రారంభమైన మెథడిస్ట్ 95వ జాతర ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాణిక్‌రావును, డీసీఎంస్ చైర్మన్ ఎం.శివకుమార్‌లను నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...మూడు రోజుల పాటు జరగనున్న జాతర ఉత్సవాలను సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట డీఎస్ సుకుమార్, సరీన్‌జాన్, రవికుమార్ ఉన్నారు.