
ఎక్కడ చూసినా చెత్తా చెదారమే
మా కాలనీలో ఎక్కడ చూసినా చెత్తాచెదారమే దర్శనమిస్తోంది. ఖాళీ స్థలలో విచ్చలవిడిగా చెత్త పారబోస్తుండటంతో ఈగలు, దోమలు ఎక్కువయ్యాయి. పందులు కూడా చెత్తలో దొర్లుతూ మురికి కూపంగా చేస్తున్నాయి. అధికారులు స్పందించి చెత్తను తొలగించాలి.
ప్రభు, నారాయణరెడ్డి కాలనీ
చర్యలు తీసుకుంటాం
సంగారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్య వ్యవస్థపై ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. చెత్త వేసినవారిపై ఫిర్యాదు చేయండి. వార్డు జవాన్లు, మున్సిపల్ కార్మికులు వచ్చి చెత్తను తొలగిస్తారు.
–ప్రసాద్ చౌహన్, మున్సిపల్ కమిషనర్