
పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
● పట్టణంలో కరువైన అధికారుల నిఘా ● విచ్చలవిడిగా చెత్త పారబోత ● రోగాల బారిన ప్రజలు
సంగారెడ్డి: జిల్లా కేంద్రంలో సంగారెడ్డిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. పట్టణంలో 38 వార్డులగాను ఏ ఒక్క వార్డులో పారిశుద్ధ్య సమస్య మెరుగు పడటం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని శాంతినగర్ బస్సు డిపో, కల్వకుంట, బాబానగర్, మర్క్స్‌నగర్ ,నారాయణరెడ్డి కాలనీ, కింది బజార్, రామ్‌నగర్, ఓల్డ్ బస్టాండ్ తదితరప్రాంతాల్లో పారిశుద్ధ్యం బాగోలేదని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. వ్యరా్‌థ్‌లను కాలనీలోనే పారవేస్తున్నా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్త పారబోయడంతో ఈగలు, దోమలు అధికమై అనారోగ్యాలపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బాబానగర్‌లో పారిశుద్ధ్య వ్యవస్థను బాగు చేయాలని కోరుతున్నారు.