మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

May 10 2025 2:14 PM | Updated on May 10 2025 2:14 PM

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

సిద్దిపేట సీపీ అనురాధ

సిద్దిపేట కమాన్‌: యువత, ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీపీ అనురాధ సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దన్నారు. తాత్కాలిక ఆనందం కోసం కుటుంబాలను దూరం చేసుకోవద్దన్నారు. మాదకద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలన్నారు. మత్తు పదార్థాల గురించి ఏదైనా సమాచారం ఉంటే డయల్‌ 100 లేదా పోలీసు కంట్రోల్‌ రూమ్‌ 87126 67100కు సమాచారం తెలపాలని సూచించారు.

గంజాయి విక్రయిస్తున్న

వ్యక్తి అరెస్టు

పటాన్‌చెరు టౌన్‌: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎకై ్సజ్‌ సీఐ పరమేశ్వర గౌడ్‌ కథనం మేరకు.. అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధి ఇసుక బావి వద్ద శుక్రవారం ఓ బహిరంగ ప్రదేశంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం అందింది. పటాన్‌చెరు ఎకై ్సజ్‌ అధికారులు వెళ్లి చూడగా రామచంద్రపురానికి చెందిన మహమ్మద్‌ ఇర్ఫాన్‌ వేరే వ్యక్తికి గంజాయి విక్రయిస్తున్నాడు. వెంటనే అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 260 గ్రాముల గంజాయిని, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించినట్లు సీఐ తెలిపారు.

మూడు చోట్ల 3.315 కిలోలు స్వాధీనం

సంగారెడ్డి జోన్‌: సంగారెడ్డి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో మూడు చోట్ల 3.315 కేజీల గంజాయి పట్టుకొని కేసులు నమోదు చేసినట్లు శుక్రవారం అధికారులు వెల్లడించారు. ఎస్‌ఆర్‌ నగర్‌కు చెందిన సందీప్‌ వద్ద నిల్వ ఉన్న 1.500 కేజీల గంజాయి, స్కూటీ, సెల్‌ ఫోన్‌, బీరంకొండకు చెందిన సాయికుమార్‌, శ్రీకాంత్‌ వద్ద నిల్వ ఉన్న 1.200 కేజీల గంజారయి, బైకు, రెండు సెల్‌ ఫోన్‌లు పట్టుకున్నామన్నారు. అలాగే మరో వ్యక్తి వద్ద 615 గ్రాముల గంజాయి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ముగ్గురిని అరెస్ట్‌ చేసి సంగారెడ్డి పోలీసులకు గంజాయితోపాటు అప్పగించామన్నారు. దాడుల్లో సీఐలు వీణారెడ్డి, బీ.గాంధీ, ఎస్‌ఐలు అనిల్‌, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మద్యం మత్తులో

చెరువులో దూకి ఆత్మహత్య

కౌడిపల్లి(నర్సాపూర్‌): చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని మహమ్మద్‌నగర్‌లో చోటు చేసుకుంది. శుక్రవారం ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్‌నగర్‌ గ్రామానికి చెందిన చాకలి దుర్గయ్య తన చిన్నకూతురు బాలమణిని కౌడిపల్లికి చెందిన చాకలి శేఖర్‌(40)కి ఇచ్చి వివాహం చేసి ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. గతేడాది కాలంగా శేఖర్‌ మద్యానికి బానిసై ఏ పని చేయకుండా తిరుగుతుండటంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి శేఖర్‌ మధ్యం సేవించి రావడంతో మళ్లీ గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న అతడు కన్నారం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి అన్న మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

క్లినిక్‌పై డ్రగ్‌ కంట్రోల్‌

అధికారులు దాడులు

జిన్నారం (పటాన్‌చెరు): ఓ ప్రైవేట్‌ క్లినిక్‌పై డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు దాడులు చేసిన ఘటన మండలంలోని వావిలాల గ్రామంలో చోటుచేసుకుంది. అధికారుల కథనం మేరకు.. విశ్వనీయ సమాచారం మేరకు పటాన్‌చెరు డ్రగ్‌ కంట్రోల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాము ఆధ్వర్యంలో శుక్రవారం జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని ఓ క్లినిక్‌ పై దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా గడువు ముగిసిన 25 రకాల మందులను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.10 వేల వరకు ఉంటుంది. ఎలాంటి అర్హత లేకుండా క్లినిక్‌ ను నిర్వాహకుడు సత్యనారాయణ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిన్నారం, బొల్లారం కంట్రోల్‌ ఇన్‌ స్పెక్టర్లు శ్రీకాంత్‌, ప్రవీణ్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement