
అకాల వర్షం.. రైతుకు నష్టం
జిన్నారం(పటాన్‌చెరు)/మునిపల్లి(అందోల్)/ రామచంద్రాపురం(పటాన్‌చెరు)/హత్నూర(సంగారెడ్డి): జిల్లాలో కొన్ని చోట్ల ఆదివారం ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. హత్నూర మండలం సిరిపురం గ్రామంలో వరి దెబ్బతిన్నది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయిందని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిన్నారం గుమ్మడిదల మండలాల్లో జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల, పోలక్‌పల్లి, వావిలాల గ్రామాల్లో కూడా పడింది. దీంతో 2 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మునిపల్లి మండలంలో ఇండ్ల మధ్య విద్యుత్ తీగల కింద ఉన్న చెట్ల కొమ్మలు తీగలకు తగలడంతో షాక్ వస్తుందేమోనని ఇండ్ల యజమానులు ఆందోళన చెందారు. రామచంద్రాపురం, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.

అకాల వర్షం.. రైతుకు నష్టం