సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

Mar 13 2025 2:36 PM | Updated on Mar 13 2025 2:35 PM

మెదక్‌ కలెక్టరేట్‌: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం మెదక్‌ సమీకృత కలెక్టరేట్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాను బాల్య వివాహా రహిత జిల్లాగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఐడీఓసీని నిత్యం పరిశుభ్రంగా ఉంచుతున్న మహిళా శానిటేషన్‌ సిబ్బందిని, మహిళా పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించి, బహుమతులు అందజేశారు. అదే విధంగా వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులను, ఉత్తమ మహిళా ఉద్యోగులను ప్రశంసాపత్రాలతోపాటు బహుమతులను ప్రదానం చేశారు. గెలుపొందిన వారికి కలెక్టర్‌ బహుమతులు అందించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సుహాసిని రెడ్డి, డీడబ్ల్యూ హైమావతి, అదనపు డీఆర్డీఓ సరస్వతీ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ విజయలక్ష్మీ, ఎస్సీ సంక్షేమ అధికారిని శశికళ, గిరిజన సంక్షేమ అధికారిని నీలిమ , మెప్మా పీడీ ఇందిరా, సీడబ్ల్యూసీ చైర్మన్‌ ఉప్పలయ్య, సీడీపీఓలు స్వరూప, హేమ భార్గవి, వెంకటరమణ, పద్మలత, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేటకమాన్‌: మహిళల సమానత్వం ఇంటి నుంచే ప్రారంభం కావాలని సిద్దిపేట సీపీ అనురాధ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పోలీస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో సీపీ బుధవారం కేక్‌ కట్‌ చేసి మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు చదువు చాలా ముఖ్యమన్నారు. విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలన్నారు. మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలన్నారు. తల్లిదండ్రులు ఇంట్లో మగ పిల్లలను, ఆడపిల్లలను సమానంగా చూడాలన్నారు. జిల్లాలో మహిళలు, పిల్లల సంరక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. పోలీస్‌ సిబ్బందికి నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన వారిని సీపీ అభినందించారు. అనంతరం మెమోంటోతో సన్మానించారు. కార్యక్రమంలో ఏఆర్‌ అదనపు డీసీపీ సుభాష్‌ చంద్రబోస్‌, సిద్దిపేట ఏసీపీ మధు, సీఐలు విద్యాసాగర్‌, విష్ణు ప్రసాద్‌, మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ దుర్గ, పోలీస్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

మెదక్‌ కలెక్టరేట్‌లో ఘనంగా మహిళా దినోత్సవం

సిద్దిపేట సీపీ అనురాధ

పోలీస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మహిళా దినోత్సవం

సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం1
1/1

సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement