సివిల్‌ తగాదాల్లో తలదూర్చొద్దు | - | Sakshi
Sakshi News home page

సివిల్‌ తగాదాల్లో తలదూర్చొద్దు

Mar 11 2025 7:23 AM | Updated on Mar 11 2025 7:22 AM

సంగారెడ్డి జోన్‌: పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ప్రతి ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని, వారి సమస్యను ఓపిగ్గా విని సత్వర న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ అన్నారు. సోమవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సివిల్‌ తగాదాలలో తల దూర్చకూడదని, చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని హితవు పలికారు. ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురాలన్నారు. సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. విధులను సక్రమంగా నిర్వర్తించాలని,, నిర్ణీత సమయంలో అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయాలని సూచించారు. శాంతి భద్రతల రక్షణలో రాజీపడొద్దని, ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

బాధ్యతల స్వీకరణ

జిల్లా నూతన ఎస్పీగా పరితోష్‌ పంకజ్‌ సోమ వారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఎస్పీ చెన్నూరి రూపేష్‌, అదనపు ఎస్పీ సంజీవరావు స్వాగతం పలికారు. అలాగే.. పోలీసు అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్‌ వల్లూరు క్రాంతితో పాటు జడ్జి భవానీ చంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు.

గణనాథుని సన్నిధిలో..

పటాన్‌చెరు టౌన్‌: రుద్రారం గణేష్‌ గడ్డ దేవస్థానంలో నూతన ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో ఉన్న స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఎస్పీకి తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఎస్పీ వెంట పటాన్‌ చెరు డీఎస్పీ రవీందర్‌ రెడ్డి, సీఐ వినాయక్‌ రెడ్డి ఉన్నారు.

బాధితులకు సత్వర న్యాయం చేయాలి

కొత్త ఎస్పీ పరితోష్‌ పంకజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement