
పోషకాహారం పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం
సంగారెడ్డి టౌన్: చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పోషణ్ అభియాన్ శిక్ష సమన్వయకర్త సౌమ్య అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లా సమాఖ్య సమావేశంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిరుధాన్యాల ప్రాముఖ్యం, పెరటి తోటల పెంపకం, పిల్లల పెరుగుదల, పోషకాహారం, ఆహార వైవిధ్యం, పంచ సూత్రాలపై అవగాహన కల్పించారు. ప్రతి మండల, గ్రామ మీటింగ్‌లలో చిరుధాన్యాల ప్రాముఖ్యత, సాగు గురించి వివరించాలన్నారు. అనంతరం పోషణ పక్షం పోస్టర్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు జ్యోతి, పోషణ అభియాన్ శిక్ష కోఆర్డినేటర్ సౌమ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.