
మిరుదొడ్డి(దుబ్బాక): పలువురి అస్వస్థతకు కారణమైన ఓ జ్యూస్ సెంటర్ అధికారులు సీజ్ చేశారు. మిరుదొడ్డిలో శ్రీలక్ష్మీనర్సింహస్వామి జ్యూస్ పాయింట్ పేరుతో నరేష్ పలురకాల జ్యూస్‌లు తయారు చేసి విక్రయిస్తున్నాడు. రెండు రోజుల క్రితం జ్యూస్ పాయింట్‌లో వివిధ రకాల జ్యూస్‌లు తాగిన 30 మంది తీవ్రఅస్వస్థతకు లోనయ్యారు. వారంతా మిరుదొడ్డి, దుబ్బాక, సిద్దిపేటలో చికిత్స పొందారు. జ్యూస్ విక్రయిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొందరు బాధితులు అధికారులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎంపీఓ జహరొద్దీన్, గ్రామ సర్పంచ్ రంగనబోయిన రాములు, గ్రామ పంచాయతీ కార్యదర్శి పహీంలు జ్యూస్ పాయింట్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే జ్యూస్ నిర్వాహకుడు పారిపోయాడు. దీంతో అధికారులు ఆ జ్యూస్ సెంటర్‌ను సీజ్ చేశారు.