
నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు
కొండాపూర్(సంగారెడ్డి): టీఎస్ పీఎస్‌సీ పేపర్ లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ రవి డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ఐబీ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీ లీకేజీ జరిగి పది రోజులవుతున్నా సీఎం స్పందించకపోవడం దుర్మార్గమని, తక్షణమే స్పందించి నిరుద్యోగులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీతో నష్టపోయిన నిరుద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వం నెలకి రూ.20 వేల ఆర్థిక సాయం ఇవ్వాలన్నారు. దీంతో పాటు టీఎస్‌పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు.