
అర్జీలు స్వీకరిస్తున్న అధికారులు
సంగారెడ్డి టౌన్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సంగారెడ్డి, జహీరాబాద్ ఆర్డీఓలు నగేశ్, రమేశ్‌బాబులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 40 వరకు అర్జీలు వచ్చాయి. అందులో భూ సమస్యలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, పింఛన్లు, స్వయం ఉపాధికి రుణాల మంజూరు తదితర అంశాలపై దరఖాస్తులు ఉన్నాయి.
● సదాశివపేట మండలంలోని మద్దిగుంట గ్రామానికి చెందిన ఎల్లారం అందయ్య తన భూమిలోని 20 గుంటలను అదే గ్రామానికి చెందిన బుచ్చయ్య అన్యాయంగా మ్యుటేషన్ చేయించుకున్నాడని, ధరణిలో అతని పేరు చూపిస్తోందని తెలిపాడు. తన 20 గుంటల భూమిని తనకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో కోరాడు.
● జహీరాబాద్ మండలంలోని కాశీపూర్ గ్రామానికి చెందిన రాధమ్మ తన భూమికి సంబంధించి తనకు పట్ట పాస్ బుక్ ఇప్పించాలని కలెక్టరేట్‌లో అర్జీ అందజేసింది.
● హత్నూర మండలం చింతల్ చెరువు గ్రామానికి చెందిన మాలతికి ఉన్న ఎకరా ఐదు గుంటల భూమిపై అదే గ్రామానికి చెందిన నలుగురు భూమి తమదని దౌర్జన్యం చేస్తున్నారనిఫిర్యాదు చేసింది. భూమి చుట్టూ కడీలు పాతుతామంటూ బెదిరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకొని, తగిన పరిష్కారం చూపాలని వేడుకొంది.