
ఇరిగిపల్లిలో కంటి పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం
ఇప్పటివరకు 5,28,897 మందికి కంటి పరీక్షలు
సంగారెడ్డి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 5,28,897 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 2,49,134 మంది పురుషులు, 2,79,735 మంది మహిళలు, 15 మంది ట్రాన్స్‌జెండర్లు కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి వెలుగు శిబిరాల్లో పురుషుల కన్నా మహిళలు అధిక సంఖ్యలో కంటి పరీక్షలు చేయించుకున్నారు.
● జిల్లాలో ఇప్పటివరకు 48,771 మందికి రీడింగ్ గ్లాసెస్ ఇవ్వగా 39,784 మందికి ప్రిస్క్రైబ్డ్ అద్దాలు అవసరమని గుర్తించారు. 9,384 మందికి సాధారణ కంటి అద్దాలు పంపిణీ చేశారు. త్వరలోనే ప్రిస్క్రైబ్ అద్దాలను పంపిణీ చేయనున్నారు. 4,40,341 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని గుర్తించారు. జిల్లాలో ఇప్పటివరకు 239 గ్రామ పంచాయతీల్లో, 87 మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తయ్యాయి. 41 గ్రామ పంచాయతీలు, 12 మున్సిపల్ వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి.
సంతోషంగా ఉంది
మా గ్రామంలో కంటివెలుగు శిబిరం ఏర్పా టు చేశారు. అక్కడే పరీక్షలు నిర్వ హించి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉంది.
– నల్లొల్లా జయమ్మ, సిద్ధాపూర్
కంటి పరీక్షలు చేసుకోవాలి
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కంటి వెలుగు శిబిరాల్లో 18 సంవత్సరాలు నిండిన వారందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి. కంటి సమస్యలు ఉన్న వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు ఇస్తారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. – కలెక్టర్ డాక్టర్ శరత్

