పర్యావరణ పరిరక్షణపై అవగాహన అవసరం
తుర్కయంజాల్: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో చైతన్యం పెంపొందాలని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గారెత్ విన్స్ ఓవెన్, మాజీ స్పెషల్ ఛీప్ సెక్రటరీ, యూఎన్‌ఏసీసీసీ నేషనల్ చైర్మన్ అజయ్ మిశ్రా అన్నారు. ఎన్విరాన్‌మెంటల్ కాన్షియస్ గ్లోబలైజేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తుర్కయంజాల్‌లోని సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇండస్ వ్యాలీ స్కూల్‌లో మంగళవారం నిర్వహించిన గ్రీన్ అవేర్‌నెస్ మాస్ ప్లాంటేషన్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండడంతో పాటు పలువురిని చైతన్యం చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్టేట్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఐఎఫ్‌ఎస్ బి.ప్రభాకర్, టీటీడీ మాజీ జేఈఓ, ఐఏఎస్ రిటైర్డ్ డా.లక్ష్మీ కాంతం, ఈసీజీ ఫౌండేషన్ కోర్ టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


