బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం: బైక్ అదుపు తప్పి ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన సోమవా రం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక సీఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎంపీ పటేల్‌గూడ గ్రామానికి చెందిన బొమ్మ రాజు(35) ఇబ్రహీంపట్నం నుంచి తన స్వగ్రామానికి వెళుతున్నాడు. కళ్లెం జంగారెడ్డి ఫంక్షన్ హాల్ సమీపంలో బైక్ అదుపు తప్పి కిందపడటంలో రాజు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
మోసం చేసిన వారిపై
కేసు నమోదు
ఇబ్రహీంపట్నం రూరల్: డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని అమాయక ప్రజల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఆదిబట్ల సీఐ రవికుమార్ తెలిపారు. కుర్మల్‌గూడకు చెందిన కళ్లెం అంజయ్య, సునీల్‌కుమార్ 36 మంది వద్ద ప్లాట్లు ఇప్పిస్తామని మోసం చేసి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేయగా నిజం అని తేలింది. దీంతో ఇరువురిపై కేసు సోమవారం నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పేకాటరాయుళ్ల అరెస్టు
కేశంపేట: మండల పరిధిలోని బైర్కాన్‌పల్లి గ్రామ శివారులోని నిర్మల ఫాంహౌజ్‌లో పేకాట ఆడుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు సీఐ నరహరి ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు, ఎస్‌ఓటీలు కలిపి ఆకస్మికంగా సోమవారం దాడులు నిర్వహించారు. 13 మంది మూడు కార్డుల జూదం ఆడుతూ పోలీసులకు చిక్కారు. వీరిలో 11 మంది పోలీసుల ఆధీనంలో ఉండగా ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్టు సీఐ తెలిపారు. రూ.2,66,940 నగదు, 14 మొబైల్‌ఫోన్లతో పాటుగా 12 సెట్ల పేకాట కార్డులు లభించాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.


