అరుణాచలక్షేత్రానికి ప్రత్యేక బస్సు
సద్వినియోగం చేసుకోవాలి
షాద్‌నగర్: తమిళనాడులోని సుప్రసిద్ధ శైవక్షేత్రం అరుణాచలం గిరి ప్రదక్షిణకు వీలుగా షాద్‌నగర్ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధ్యాత్మిక యాత్రగా వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. డిపో నుంచి వచ్చేనెల 3న (బుధవారం) ప్రత్యేక బస్సును కేటాయించారు. సాయంత్రం 7 గంటలకు డిపో నుంచి బస్సు బయలుదేరుతుంది. 4వ తేదీ ఉదయం 4గంటలకు కాణిపాకం చేరుకొని అక్కడ దేవాయలం దర్శనం అనంతరం గోల్డెన్ టెంపుల్‌కు చేరుకుంటుంది. దర్శనం తర్వాత రాత్రికి అరుణాచలం బయలుదేరుతుంది. 5న శుక్రవారం పౌర్ణమి రోజున భక్తులకు గిరి ప్రదక్షిణ ఉంటుంది. స్వామి దర్శనం తర్వాత అదే రోజు సాయంత్రం 5గంటలకు తిరుగు ప్రయాణమై 6న ఉదయం షాద్‌నగర్ డిపోకు చేరుకుంటుంది.
బస్సు చార్జీలు ఇలా..
పెద్దలకు రూ.3,600, పిల్లలకు రూ.2,400 టికెట్ ధర నిర్ణయించారు. వసతి, ఫలహారం, భోజనం ఖర్చులు ఎవరికి వారే భరించుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు షాద్‌నగర్ డిపోలోని రిజర్వేషన్ కౌంటర్‌లో లేదా 99592 26287, 91826 95281 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
డిసెంబర్ 3న షాద్‌నగర్ డిపో నుంచి..
అరుణాచలం క్షేత్రానికి డిసెంబర్ 3న ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడిపిస్తున్నాం. రిజర్వేషన్ కౌంటర్‌లో టికెట్లు తీసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– ఉష, డిపో మేనేజర్, షాద్‌నగర్
అరుణాచలక్షేత్రానికి ప్రత్యేక బస్సు


