మత్తు వదలరా!
షాబాద్: యువత మత్తుకు బానిస అవుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా బానిస అవుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీంతో తమ బంగారు భవిష్యత్‌ను చేజేతులా అంధకారంలోని నెట్టి వేసుకుంటున్నారు. అంతేకాకుండా కుటుంబాలు కూడా ఛిన్నాభిన్నం అవుతున్నాయి. మత్తుకు బానిస అయిన వారికి అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో గ్రామసభల ద్వారా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో గుట్కా నుంచి గంజాయి వరకు విచ్చల విడిగా వినియోగిస్తూ తమ జీవితలను నాశనం చేసుకుంటున్నారు. దీంతో అధికారులు గ్రామాల బాట పట్టారు. మత్తు పదార్థాలు వాడకం వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. గంజాయి, గుట్కా, తంబాకు, మద్యం మత్తులో నేరాలకు పాల్పడుతూ కటాకటాల పాలవుతున్నారు.
మత్తుతో కలిగే అనర్థాలు
● మత్తు పదార్థాలు తాగడంతో ఏం చేస్తున్నామో తెలియక అత్యాచారాలు, అఘాయిత్యాలు చేస్తున్నారు.
● తాగి వాహనడం నడపడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
● చిరాకు, కోపం ఎక్కువై కుటుంబాల్లో కలహాలు ఏర్పడుతున్నాయి.
● ఆరోగ్యం క్షీణించి యువత ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
● అధిక మత్తు పదార్థాలైన డైజోఫాం కలిపిన కల్లు తాగి మతి స్థిమితం కోల్పోతున్నారు.
గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న అధికారులు
యువత సన్మార్గంలో నడవాలని సూచన


