విద్యుదాఘాతానికి వలసజీవి బుగ్గి
నందిగామ: ఐరన్ పరిశ్రమలో ఫర్నేస్(వస్తువులను వేడి చేసే పరికరం) వద్ద పైపును శుభ్రం చేస్తుండ గా విద్యుదాఘాతానికి గురై ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటన కొత్తూ రు మండల కేంద్రం సమీపంలో చోటు చేసుకుంది. కొత్తూరు ఎస్‌ఐ గోపాలకృష్ణ కథనం ప్రకారం.. బిహా ర్ రాష్ట్రం కై మూరు జిల్లా కుక్కురాద్ గ్రామానికి చెందిన రమేశ్ పాండే(41) తన కుటుంబ సభ్యులతో కలిసి 15 ఏళ్ల క్రితం బతుకు దెరువు కోసం కొత్తూరుకు వలస వచ్చారు. అప్పటి నుంచి స్థానిక వినాయక స్టీల్ పరిశ్రమలో ఫిట్టర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి 8 గంటలకు యథావిధిగా విధులకు హాజరయ్యారు. ఆదివారం తెల్లవారుజామున పరిశ్రమలోని ఫర్నేస్ ఆగిపోవడంతో అక్కడి కాయిల్ వద్ద తోటి కార్మికులు అజిత్ కుమార్, సంతోష్ కుమార్, శంభూ యాదవ్‌లతో కలిసి రమేశ్ పాండే పైపును శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో అతడి శరీరం ఒక్కసారిగా కాలిపోవడంతో తోటి కార్మికులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు యజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.


