
● నిర్వహణ లోపం.. వెలగని వీధి దీపం
ఇబ్రహీంపట్నం: మున్సిపాలిటీలో 4,313 వీధి దీపాలు ఉండగా సెంట్రల్ లైటింగ్ 650, హైమాస్ట్ లైట్లు 20 ఉన్నాయి. నిర్వహణ లోపంతో తరచూ వీధిలైట్లకు అంతరాయం కలుగుతోంది. శ్రీ ఇందు కళాశాల నుంచి ఇబ్రహీంపట్నం వరకు ప్రధాన రహదారిపై అమర్చిన సెంట్రల్ లైటింగ్ పనితీరు అస్తవ్యస్తంగా ఉంది. ఎప్పుడు లైట్లు వస్తాయో, పోతాయో తెలియని పరిస్థితి. తరచూ లైట్లు, వైర్లు ఖాళీపోయి, చెడిపోతుండటంతో రాత్రివెళ ఆ రహదారిలో ప్రయాణించే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్ యార్డు వెనుక ఉన్న పలు కాలనీలతోపాటు కొత్తగా వెలుస్తున్న కాలనీల్లో విద్యుత్ స్తంభాలు లేక వీధిలైట్లను అమర్చడం లేదు. ఆయా కాలనీల్లో రాత్రి వేళ అంధకారం అలముకుంటోంది.