బీసీల అభివృద్ధికి సమష్టి కృషి | - | Sakshi
Sakshi News home page

బీసీల అభివృద్ధికి సమష్టి కృషి

Jul 5 2025 9:27 AM | Updated on Jul 5 2025 9:27 AM

బీసీల అభివృద్ధికి సమష్టి కృషి

బీసీల అభివృద్ధికి సమష్టి కృషి

షాబాద్‌: బీసీలు సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధించాలని బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో బీసీసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా మధు, ఉపాధ్యక్షుడిగా పోచయ్య, ప్రధాన కార్యదర్శిగా సుభాన్‌, సభ్యులుగా కృష్ణ, జనార్దన్‌, రమేశ్‌ ఎన్నుకొని నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. దేశ జనాభాలో 50 నుంచి 60 శాతం వరకు బీసీలు ఉన్నప్పటికీ రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారన్నారు. ఆధిపత్య వర్గాలతోనే బీసీలు అన్ని రంగాల్లో వెనుక బడుతున్నారని ఆరోపించారు. ఆర్‌.కృష్ణయ్య ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి బీసీలను బలోపేతం చేస్తున్నామన్నారు. బీసీలకు అన్ని విధాలా అన్యాయం జరుగుతుందని, హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. దీనికోసం పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలంతా పోటీకి సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బీసీసేన మండల అధ్యక్షుడు దయాకర్‌చారి, యూత్‌ అధ్యక్షుడు అజయ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు మాణిక్యం, నాయకులు స్వామి, బాల్‌రాజ్‌, గణేష్‌, మల్లేష్‌, కృష్ణ, కుమార్‌, ప్రభాకర్‌, యాదిగిరి, గోపాల్‌, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మహిళలు రాజకీయాల్లో రాణించాలి

కేశంపేట: మహిళలు రాజకీయాల్లో రాణించాలని బీసీ సేన జిల్లా అధ్యక్షుడు సదర్‌ శ్రీనివాస్‌యాదవ్‌ సూచించారు. మండల కేంద్రంలో శుక్రవారం బీసీసేన మహిళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా మండల కమిటీని ఎంపిక చేశారు. అనంతరం శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ.. బీసీలు రాజకీయాల్లో వచ్చి తమ హక్కులను సాధించుకోవాలన్నారు. బీసీలందరూ ఏకమై రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి బీసీ నినాదంతో ముందుకువెళ్లాలని సూచించారు. మండల కమిటీ అధ్యక్షురాలిగా వనమ్మ, ఉపాధ్యక్షులుగా శ్రీలత, కవిత, ప్రధాన కార్యదర్శులుగా అనూష, మాధవి, కార్యదర్శులుగా అశ్విని, భవాని, కోశాధికారిగా ధనరేఖలను ఎన్నుకొని నియామక పత్రాలను అందించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌, వెంకటేష్‌, నియోజకవర్గ అధ్యక్షురాలు బాస వరలక్ష్మి, సభ్యులు లింగమ్మ, యాదమ్మ, పుణ్యవతి, నాగమణి, సుచరిత, పరమేశ్వరి, కృష్ణమ్మ, రేణుక, అఖిల తదితరులు పాల్గొన్నారు.

బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement