
అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు
షాద్‌నగర్‌రూరల్: అగ్ని ప్రమాదాల నివారణకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు షాద్‌నగర్ పట్టణ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫంక్షన్ హాల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, లాడ్జీ, హోటల్స్, హాస్టల్స్ యజమానులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాల నివారణకు అందరూ తగిన విధంగా కృషి చేయాలని సూచించారు. వ్యాపారులు తప్పనిసరిగా మున్సిపల్, అగ్నిమాపక శాఖ అనుమతులు విధిగా తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ట్రేడ్ లైసెన్సు, రెంటల్ డీడ్, లీజ్ అగ్రిమెంట్, వైద్య, ఆరోగ్య శాఖ, ఎన్‌ఓసీ, పోలీస్ శాఖల నుంచి విధిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అధికంగా వచ్చే వ్యాపార కేంద్రాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమన్నారు. సమావేశంలో ఎస్‌ఐలు శరత్‌కుమార్, సుశీల, ప్రణయ్, నరేందర్, శ్రీకాంత్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
సీఐ విజయ్‌కుమార్